2025 Admissions to Jvvv to Open from Dec 8, 2024.
పిల్లలు సంతోషంగా ఎదగాలి. విద్యావేత్తల ఆలోచనా సరళికి అనుగుణంగా వికాస విద్యావనం లక్ష్యాలను ఎంచుకున్నాం. సమగ్రమైన ఎదుగుదలకు తోడ్పడే విధంగా విద్యా ప్రణాళిక ఏర్పాటయింది. దానిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం.
NCERT సారథ్యంలో రూపొందించిన ECCE ప్రణాళిక ఆధారంగా బొమ్మరిల్లు తరగతుల ప్రణాళిక ఏర్పాటయ్యింది.
బడిలో చేరే సమయానికి బొమ్మరిల్లు పిల్లలు బాత్రూం అవసరం చెప్పగలగాలి. చేతితో తమంత తాము తినే ప్రయత్నం చేయాలి.
ప్రాధమిక తరగతులలో మాతృభాషే మాధ్యమం. ఇంగ్లీషు భాషగా బొమ్మరిల్లు తరగతుల నుండి పరిచయం అవుతుంది. ఐదవ తరగతి పూర్తయే సమయానికి ఇంగ్లీషు మాధ్యమంలో నేర్చుకునే స్థాయికి విద్యార్థి చేరుకోవడమే మా విద్యాప్రణాళిక లక్ష్యం.
తరగతి పుస్తకాలు స్కూలుకే పరిమితం. ప్రతి తరగతిలోనూ తరగతి లైబ్రరీ వుంటుంది. లైబ్రరీ నుండి రోజూ యింటికి పుస్తకం తీసుకువెళ్లే అవకాశం వుంది. హోమ్ వర్క్ ఉండదు. గ్రేడులు లేవు. పోటీకి ప్రోత్సాహం లేదు. ఎటువంటి శిక్షలు లేవు; బహుమతులు కూడా లేవు.
పిల్లలు సంతోషంగా ఎదిగేందుకు చదువులు ప్రతిబంధకం కాకూడదు. ఎవరి స్థాయిలో వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరి వేగంలో వారు నేర్చుకుంటారు. పిల్లలు అడిగితేనే, అడిగినంతమేరకే తల్లిదండ్రులు యింట్లో చదువులను పట్టించుకోవాలి. అలా కాకపొతే తరగతి గది కార్యక్రమాలలో విద్యార్థికి పాల్గొనే ఆసక్తి వుండదు. ట్యూషన్లు మా విధానానికి సరిపడవు.
వికాస విద్యావనంలో భయం లేని వాతావరణం వుండేలా జాగ్రత్త తీసుకుంటాం. భయపడే వాతావరణం యింటి దగ్గర వున్నట్లయితే, వికాస విద్యావనంలో చేర్చే ఆలోచన సరైనది కాదు.
పిల్లలందరూ బడిలో యిచ్చే జావ, మధ్యాహ్నభోజనం తప్పక తీసుకోవాలి. 4, 5 తరగతుల పిల్లలకు యిచ్చే అల్పాహారం పిల్లలందరూ తీసుకోవాల్సిందే. పిల్లలకు మేము యిచ్చే ఆహారం తినడానికి యిబ్బంది పడుతుంటే నెమ్మదిగా అలవాటు చేసే ప్రయత్నం చేస్తాం. ససేమిరా మొండికేస్తే ఆ తర్వాతి ఏడాది ఈ బడి మానేయాల్సి వుంటుంది.
శ్రమ విలువను గుర్తించేలా, వికాస విద్యావనంలో 4, 5 తరగతుల పిల్లలు, టీచర్లు కలిసి పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.
బస్సు సౌకర్యం లేదు.
స్కూలు క్యాలెండర్ లోని తేదీల లోపు ఫీ చెల్లించాలి. ఆలస్యం చేస్తే లేటు ఫీతో కలిపి కట్టాలి. ఈ విషయంలో ఆఫీసు సిబ్బందితో ఎటువంటి వాగ్వివాదాలకు తావులేదు.
ఈ అవగాహన తోనే మీ అబ్బాయి/అమ్మాయిని వికాస విద్యావనంలో చేర్చే ఆలోచన చేయండి.
అడ్మిషన్ వివరాల కొరకు మా ఆఫీస్ ని సంప్రదించండి:
ఫోన్: (0866)2975494 వాట్సాప్: 7901052494 ఈ-మెయిల్: vvvoffice@vikasa.org
ప్రవేశ రుసుం : రూ. 1000/-
కాషన్ డిపాజిట్ : రూ. 1000/-
సంవత్సరానికి ఫీజు:
బొమ్మరిల్లు(B0, B1, B2), 1 తరగతులకు :
రూ. 51,000/- (Term wise: 25k, 13k, 13k)
2 నుండి 5 తరగతులకు :
రూ. 57,000/- (Term wise: 29k, 14k, 14k)
ఫీ చెల్లింపులు ఆన్లైన్/బ్యాంకు డిపాజిట్ గా మాత్రమే చెల్లించగలరు
గుర్తుంచుకోవలసిన తేదీలు (2025-26):
మొదటి విడత అడ్మిషన్స్:
తరగతులు: PS1 (3+), PS2 (4+), PS3 (5+) మాత్రమే.
అడ్మిషన్స్ మొదలయ్యే తేది: 24/11/2024
రిజిస్ట్రేషన్ ఆఖరి తేది: 31/12/2024
రెండవ విడత రిజిస్ట్రేషన్:
తరగతులు: PS1, PS2, PS3
అడ్మిషన్స్ మొదలయ్యే తేది: 01/01/24
రిజిస్ట్రేషన్ ఆఖరి తేది: 06/02/2024
వికాస విద్యావనం
బ్యాంకు అకౌంట్ వివరాలు:
Name : Vikasa Vidya Vanam
Account No. : 330002050000002
Bank : Union Bank of India
Branch : Poranki
IFS Code : UBIN0533009